విశాఖ హార్బర్ లో బోట్లు తగలబెట్టింది వీళ్లే..

విశాఖ హార్బర్ లో బోట్లు తగలబెట్టింది వీళ్లే..

విశాఖ హార్బర్ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ప్రమాదం జరిగిన అనంతరం బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.  ఘటన జరిగిన ఆరు రోజులకు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు.


విశాఖ సీపీ శంకర్​ అయ్యన్నర్​ తెలిపిన వివరాల ప్రకారం...

వాసుపల్లి నాని అతని మామ సత్యం అనే వీరిద్దరే ప్రమాదానికి  కారణమని పోలీసులు తేల్చారు.  వాసుపల్లి నానీ అక్కడ బోట్లలో కుక్ గా, సత్యం వాచ్ మెన్ గా పనిచేస్తుంటారు. నవంబర్​ 19 వ తేదీ సాయంత్రం 6 గంటలకు మద్యం తాగేందుకు  వీరిద్దరు హార్బర్​ కు వచ్చి  అల్లిపల్లి వేంకటేశ్ కు చెందిన 887 నెంబర్ బోటులో మద్యం తాగి  అక్రడే  ఫిష్ ప్రై చేసుకొని పార్టీ చేసుకున్నారు. తరువాత సిగరెట్​ తాగి మద్యం మత్తులో పక్కనే ఉన్న 815 నెంబర్​ గల బోటుపై పడేశారు.  అక్కడ వలలు ఉండటంతో మెల్ల మెల్లగా మంటలు చేలరేగాయి. గాలి బాగా రావడంతో మంటలు వ్యాపించడంతో వారిద్దరే అక్కడి నుంచి జారుకున్నారు.   ఈ ఘటనలో  30 బోట్లు పూర్తిగా దగ్ధం అవ్వగా, 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయి. 8 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

సీసీ పుటేజీ విడుదల…

ప్రమాదం జరిగిన అనంతరం బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఇందుకు సంబంధించిన పుటేజీని కూడా విడుదల చేశారు పోలీసులు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:49 నిమిషాలకు ఇద్దరు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారని… 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించి ..  పోలీసులు కేసు నమోదు చేశారు.  50 సీసీ కెమారాలను పరిశీలించిన తరువాత నిందితులపై ఐపిసి సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేసి  అదుపులోకి తీసుకొన్నారు. 

యూట్యాబర్ నాని రియాక్షన్…

విశాఖ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో యూట్యాబర్ లోకల్ బాయ్ నాని పాత్రపై అనేక అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా అతడిని సుదీర్ఘంగా విచారించారు.  తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.ప్రాథమిక సమాచారం మేరకు కేవలం విచారణలో భాగంగానే నాని తీసుకువచ్చామన్నారు. విచారణలో అతడి ప్రమేయం లేదంటే తాము ప్రోసీజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్లమని.. కానీ ఈ లోపే హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించామమన్నారు. ఇన్ని రోజులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.   కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్‌ను మానిటర్ చేస్తామన్నారు. ఇద్దరు హార్బర్‌ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆరా తీస్తే నానితో పాటూ సత్యం పాత్ర బయటపడిందని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద నిందితుల్ని అరెస్ట్ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడింది..